తెలంగాణ ప్రజల సంక్షేమమే కెసిఆర్ లక్ష్యం-రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథరెడ్డి
తెలంగాణ ప్రజల సంక్షేమమే కెసిఆర్ లక్ష్యం
-రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథరెడ్డి
సత్తుపల్లి , శోధన న్యూస్ : తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గెలుపే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో 3,15,16 వార్డుల పరిధిలోనిర్వహించిన ఆత్మీయ సమావేశంలో బండి పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్నిగుర్తించి 13 సంవత్సరాలు పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ అని,ప్రపంచంలోనే ఇలాంటి చరిత్ర కలిగిన వ్యక్తి లేడని నిరంతరం ఆయన మనసులో తెలంగాణ ప్రాంత అభివృద్ధి ప్రజల సంక్షేమమే ఆలోచిస్తూ ఉంటారన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలని లక్ష్యంతో పని చేస్తూ 10 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధిని సాధించారని మరొకసారి ప్రజలు ఆశీర్వదించి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. ప్రజలు సంపూర్ణ అక్షరాస్యులుగా చూడాలనేది ఆయన లక్ష్యమని మన విద్యార్థుల మేధాశక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని విద్యారంగంలో సమూల మార్పులు చేశారన్నారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యారంగానికి పెద్దపీట వేశారన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోటూరి మానవతారాయ్ మాట్లాడుతూ పది సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూడాలని అన్ని వర్గాల వారికి ఏదోరకంగా ప్రభుత్వ పథకాలు అందాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మరింత వేగవంతం చేయాలంటే మూడవసారి బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరల అధికారంలోకి వచ్చిన వెంటనే సత్తుపల్లిని జిల్లాగా చేసి నియోజకవర్గంలో అర్హులైన దళితులందరికీ వెంటనే దళిత బంధు అమలు చేస్తామన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళ ఎకౌంట్లో ప్రతినెల 3 వేల రూపాయలు వేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతామన్నారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న సుమారు కోటి కుటుంబాలకు వర్తించే విధంగా ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. కళ్ళ ముందు జరిగిన అభివృద్ధిని చూడండి కారు గుర్తుకు ఓటు వేసి సండ్ర వెంకట వీరయ్య ను గెలిపించండి.ఈ కార్యక్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, డిసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రఫీ, గొర్ల సంజీవరెడ్డి మేకల నరసింహారావు, వీరపనేని రాధిక బాబి, మాధురి మధు వల్లభనేని పవన్. వెదుళ్ల నాగు, దోసపాటి దామోదర్, పుచ్చ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.