తెలంగాణ రాష్ట్రానికై ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీకాంతాచారి
తెలంగాణ రాష్ట్ర సిద్దికై ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీకాంతాచారి
సత్తుపల్లి, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్రం కొరకు జరిగిన మలి ఉద్యమంలొ ప్రాణ త్యాగం చేసిన తొలి అమరజీవి శ్రీకాంతాచారి అని తెలంగాణ రాష్ట్ర సాధన జేఏసి.నాయకులు అన్నారు.ఆదివారం సత్తుపల్లి రింగ్ సెంటర్ లో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళి ఘటించారు.అనంతరం జేఏసి. చైర్మన్, కన్వీనర్ లు చిత్తలూరి ప్రసాద్,కూకలకుంట రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకొని స్పూర్తిని నింపిన తొలి వ్యక్తి అయ్యారని అన్నారు.శ్రీకాంతాచారి స్పూర్తితో, సత్తుపల్లి జిల్లాను ఏర్పాటు చేసుకుంటామని అన్నారు.శ్రీకాంతాచారికి నివాళి ఘటించిన వారిలో అయ్యదేవర శేషగిరిరావు,నాగాచారి,దారా ఏసురత్నం,మధుసూధనాచారి,ఎల్.ఎస్.రెడ్డి, జాగృతి సాగర్,మధుసూదన రాజు, రామకృష్ణ, సత్యనారాయణ, యువసేవ సమితి జొన్నల గడ్డ రాజు తదితరులు ఉన్నారు.