తొలి నామినేషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పాయం
తొలి నామినేషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పాయం
మణుగూరు, శోధన న్యూస్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం తన నామినేషన్ పత్రాలను భద్రాచలం ఐటిడిఎ పీఓ, పినపాక నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతిక్ జైన్ కు అందజేశారు. శుక్రవారం నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవ్వగా.. తొలి రోజు ఒక్కరూ కూడా నామినేషన్ వేయలేదు. శనివారం పాయం వెంకటేశ్వర్లు తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ… బిఆర్ ఎస్ నిరంకుశ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ప్రతీ గ్రామం లో కాంగ్రెస్ ను ప్రజలు ఆధారిస్తున్నారని తెలిపారు. .ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం లో, పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి ఖమ్మం జిల్లా, డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరు బ్రహ్మయ్య, నియోజకవర్గ మహిళ నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి, సీనియర్ నాయకులు కాటిబోయన నాగేశ్వరరావు, సామా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.