దళితులను మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీని ఓడించండి
దళితులను మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీని ఓడించండి
– బిజెపి పార్టీ భద్రాచలం అసెంబ్లీ కో కన్వీనర్ క్రాంతి కుమార్
చర్ల, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో దళితులను మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీని ఓడించాలని భారతీయ జనతా పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ కోకన్వీనర్ బిట్రగుంట క్రాంతి కుమార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి పార్టీ అభ్యర్థి కుంజా ధర్మారావు గెలుపుని కాంక్షిస్తూ సోమవారం మండల కేంద్రంలోని పాత చర్ల ఏరియాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.గత పది సంవత్సరాలుగా పేద,బడుగు,బలహీన వర్గాలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, రైతులకు ఉచిత ఎరువులు తదితర హామీలిచ్చి, మాట తప్పిన బిఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడిపే అర్హత లేదని విమర్శించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీని ప్రకటించడం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం,గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేయడం బిజెపి ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు. బీసీ ముఖ్యమంత్రి హామీతో ముందుకు వస్తున్న భారతీయ జనతా పార్టీకి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని, భద్రాచలం నియోజకవర్గం లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుంజా ధర్మారావు కమలం గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు ముత్తారం రత్తయ్య,యడవల్లి శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శులు ఆలేం సమ్మయ్య, పగడాల శ్రీధర్ రావు,కార్యదర్శి చిడెం జగన్మోహన్రావు,బందా మధు, కొండేటి చంద్రశేఖర రావు, చిడెం జగదీష్ తదితరులు పాల్గొన్నారు.