దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు
పినపాక, శోధన న్యూస్ : తుఫాన్ ప్రభావంతో వర్షాల దాటికి మండలంలో దెబ్బతిన్న వరి, మిరప, పత్తి పంటలను మండల వ్యవసాయ అధికారులు శుక్రవారం పరిశీలించారు. పొట్లపల్లి సర్పంచ్ తోలెం కళ్యాణి క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను రైతుల ఇబ్బందులను వ్యవసాయ అధికారులకు చూపించి వివరించారు. గత ప్రభుత్వం రైతులకు పంట బీమా చేయించామని చెప్పిందని, ఆయా పంట బీమా అర్హత ఉన్న రైతులకు అధికారులు సంబంధిత భీమా కంపెనీ నుంచి పరిహారం ఇప్పించాలని, మిగతా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ కళ్యాణి మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతుల వివరాలు సేకరించి పరిహార నిమిత్తం ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ రమేష్ ,స్థానిక రైతుల కృష్ణ ,శేరు వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.