దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
కొణిజర్ల, శోధన న్యూస్ : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాలలో గత రెండు రోజులుగా ఎ డతెరిపి లేకుండా మిచౌoగ్ తుఫాను వలన చేతికొచ్చిన వరి నెలకొరిగింది. మొక్కజొన్న కూడా దెబ్బతింది. నీట మునిగిన పంటలను మండల వ్యవసాయ అధికారి డి బాలాజీ బుధవారం పరిశీలించారు. మండలంలోని పెద్దగోపతి, కొండ వనమాల, కాచారం, మునగాల పల్లిపాడు గ్రామాల్లో పంటలను పరిశీలించారు. మిగిలిన గ్రామాల్లో ఎంత నష్టం జరిగిందన్న విషయాలను ఏఈఓస్ ద్వారా గ్రామాలలో వెళ్లి నష్టవంచన కోసం ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందన్నారు. మరో నాలుగు రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలని వర్షం పూర్తిగా తగ్గే వరకు వరి కోతలు చేపట్టవద్దని వరి పొలంలో నీరు నిలువ లేకుండా కాలువలు తీసి నీరు బయటకు పంపించాలని తెలిపారు. రెండు శాతం ఉప్పు నీరుని పడిపోయిన వరి మీద పిచికారి చేయాలని తడిచిన వరి మొలకలు రాకుండా ఉంటుందని ఆయన తెలిపారు. మిరప తోటలో నీరు నిలవ లేకుండా మురుగు కాలువలు చేసి మురుగునీరు బయటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాలు ఆగిపోయిన తర్వాత పొట్టేషియం నైట్రేట్ ఎకరంకు రెండు కేజీ పిసికారి చేయాలని రైతులు పొలం దగ్గరే ఉన్న కరెంటు మోటార్స్ దగ్గరకు వెళ్ళవద్దని ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కిందకు వెళ్ళవద్దని, వచ్చే రెండు రోజుల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ రైతులకు విజ్ఞప్తి చేశారు.