దేశానికి వెన్నెముక రైతు -డిసిసిబి డైరెక్టర్ చల్లగుళ్ళ కృష్ణయ్య
దేశానికి వెన్నెముక రైతు
-డిసిసిబి డైరెక్టర్ చల్లగుళ్ళ కృష్ణయ్య
సత్తుపల్లి, శోధన న్యూస్: రైతే దేశానికి వెన్నెముక అని డిసిసిబి డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక భారత్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఫినోలెక్స్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ కంపెనీ రైతులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చల్లగుల్ల కృష్ణయ్య మాట్లాడుతూ రైతు దినోత్సవం సందర్భంగా రైతులను గుర్తిస్తూ వారిని సత్కరించడం గొప్ప విషయం అన్నారు. మనది వ్యవసాయ ఆధారిత దేశమని, రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. సాగునీటి కష్టాల నుంచి బయటపడేందుకు బోర్లు, మోటార్లను పెద్ద సంఖ్యలో రైతులు వినియోగిస్తున్నారని, అటువంటి వాటిలో ఫినోలెక్స్ నమ్మకమైన, నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుందన్నారు. ఫినోలెక్స్ డీలర్ చింతకుంట్ల వినయ్ బాబు మాట్లాడుతూ మార్కెట్లో ఉన్న నాణ్యమైన పైపుల్లో తమ కంపెనీ మేటిగా నిలోచిందన్నారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఎక్కువ కాలం మన్నికనిచ్చే పైపులుగా ఫినోలెక్స్ కు మంచి గుర్తింపు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్లు చింతకుంట్ల వెంకటాచారి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నాగరాజు, రైతులు వెంపాటి లక్ష్మినారాయణ, కొల్లి నరసింహారావు, దాసరి మాధవరెడ్డి ,బండ శ్రీనివాసరెడ్డి, తుమ్మూరు మహేశ్వర్ రెడ్డి బింగి వెంకటేశ్వర్లు, తుమ్మూరు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.