తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

దేశానికే మార్గదర్శకంగా సీఎం కేసీఆర్ సుపరిపాలన- ప్రభుత్వ విప్   రేగా కాంతారావు  

దేశానికే మార్గదర్శకంగా సీఎం కేసీఆర్ సుపరిపాలన

-బిఆర్ఎస్ తోనే మరింత అభివృద్ధి 

-ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు

-నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశా

– ప్రభుత్వ విప్   రేగా కాంతారావు  

పినపాక, శోధన న్యూస్ : దేశానికే మార్గదర్శకంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో  సుపరిపాలన అందిస్తున్నారని  ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే    రేగా కాంతారావు అన్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ప్రభుత్వ విప్   రేగా కాంతారావు   ఎన్నికల ప్రచారంలో భాగంగా సీతారాంపురం, గడ్డంపల్లి, పొట్లపల్లి, ఉలవచెలక , మల్లారం, వెంకటేశ్వర్లపురం, జగ్గారం, వెంకట్రావు పేట, చింతల బయ్యారం, పాత రెడ్డిపాలెం, సింగిరెడ్డిపల్లి, మొద్దులగూడెం, పాండురంగాపురం, జానంపేట, భూపతిరావుపేట,చేగర్శల, టీ కొత్తగూడెం , గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. గ్రామాలలో స్థానిక ప్రజలు పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో వారికి పూల వర్షంతో ఘన స్వాగతాలు పలికారు,.    గ్రామాలలోని గ్రామదేవతలను దర్శించుకున్నారు.  ప్రజలు ఆయనకు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో దేశానికే మార్గదర్శగా నిలిచిందన్నారు. నిరంతర విద్యుత్ రైతుబంధు సాగునీళ్ళతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారి దేశానికే అన్నం పెట్టే స్థాయికి తీర్చబడిందన్నారు.  సీఎం కేసీఆర్   నాయకత్వాన్ని ప్రజలందరూ మరోసారి బలపరచాలని కోరారు.   పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూడండి.. విజ్ఞానులైన నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించాలని అన్నారు.  జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించి నియోజకవర్గంలోని ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరుస్తానని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని మతాల కులాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ప్ర కటించిన మ్యానిఫెస్టో అందరి మనసులను హత్తుకునే విధంగా ఉందన్నారు. కెసిఆర్ బీమా ప్రతి కుటుంబానికి ధీమాగా అండగా నిలుస్తుంది అన్నారు. ముఖ్యంగా దివ్యాంగులకు పెన్షన్ పెంపు, రైతుబంధు ఎకరాకి రూ 16,000, సన్న బియ్యం అన్నపూర్ణ పథకం, మహిళలకు జీవన భృతి ఇచ్చే సౌభాగ్య లక్ష్మి, 15 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, 400 గ్యాస్ సిలిండర్ వంటి మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండి ప్రజలు అందరిని అభిమానాలు పొందుతున్నాయన్నారు. అన్నదాతలకు రైతుబంధు రైతు బీమా సాగునీరు సకల ఎరువులు పంటలు కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర కల్పించిన సీఎం కేసీఆర్  రైతు బాంధవుడుగా నిలిచారని కొనియాడారు. సీఎం కేసీఆర్  చేపడుతున్న బృహత్తర పథకాలను చూసి ఆర్థిక శాస్త్రవేత్తలు బిత్తర పోతున్నారని అన్నారు.  తెలంగాణ బాగు కోసం సీఎం కేసీఆర్   తాపత్రయపడుతుంటే కాంగ్రెస్ నాయకులు అధికారం కోసం అడ్డమైన నిరాధారమైన ఆరోపణలతో సీఎం కేసీఆర్ ని  విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో బిఆర్ఎస్ నాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *