దోబీ ఘాట్ నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
దోబీ ఘాట్ నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
ఇల్లందు, శోధన న్యూస్ : ఇల్లందు పురపాలక సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న ధోబి ఘాట్ నిర్మాణ పనులను బుధవారం మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ధోబిఘాట్ నిర్మాణ పనులు శరవేగంగా జరగాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని తెలిపారు. జిల్లాలో నే నెంబర్ వన్ గా ఉండే విధంగా ధోబిఘాట్ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సంఘ నాయకులు డెకరేషన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.