ఖమ్మంతెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

-వైరా శాసనసభ్యులు మాలోత్ రామదాసు నాయక్

వైరా , శోధన న్యూస్ : నియోజకవర్గ కేంద్రమైన వైరా మండలంలోని గన్నవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైరా నూతన శాసనసభ్యులు మాలోతు రామదాసు నాయక్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి రైతులు కూడా తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గిట్టుబాటు ధరలతో ప్రభుత్వ అజమాయిసీ ప్రకారం కొనుగోలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు జరిపి రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధించిన అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే విధంగా నూతనంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తప్పకుండా ప్రతి రైతును ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి లోపాలు లేకుండా రైతులకు నష్టం వాటిల్లకుండా కొనుగోలు కేంద్రాల్లో తగు జాగ్రత్తలు తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని కొనుగోలు పకడ్బందీగా జరిపి రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని ఆయన సంబంధించిన అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బి రాజశేఖర్ నర్సిరెడ్డి పలు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *