నామినేషన్ల ఉప సంహరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి -భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక
నామినేషన్ల ఉప సంహరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం , శోధన న్యూస్ : బుధవారం నామినేషన్ ఉప సంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటించన్నందున రిటర్నింగ్ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. మంగళవారం ఐడిఓసి మిని సమావేశపు హాలులో అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోలింగ్ స్లిప్పులు. పంపిణీ తదితర అంశాలపై నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 16వ తేదీ నుంచి ఓటర్ స్లిప్పులు పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నందున ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఓటరుకు పోలింగ్ స్లిప్పులు అందాలని తెలిపారు. ఇందుకు సంబందించి పర్యవేక్షణకు నోడల్ అధికారిని నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారులు ప్రతిక్ జైన్, రాంబాబు, శిరీష, మంగీలాల్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.