నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లు పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి
నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లు పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి
మణుగూరు, శోధన న్యూస్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 3వ తేదీ నుండి చేపట్టబోయే నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం పినపాక నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. నామినేషన్ స్వీకరించే రోజు నుండి ముగింపు రోజు వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల దూరం వరకు ఇతరులు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నాం 3గంటల వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని, నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే అనుమతించాలన్నారు. నామినేషన్ల ప్రక్రియను సిసి కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించడమే కాకుండా వీడియో రికార్డింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.