నిబంధనలను అతిక్రమించవద్దు
నిబంధనలను అతిక్రమించవద్దు
-దమ్మపేట ఎస్సై రవికుమార్
దమ్మపేట , శోధన న్యూస్ : దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలోగల ప్రజలకు మరియు మరియు వివిధ పార్టీల కార్యకర్తలకు తెలియజేయునది ఏమనగా, అశ్వారావుపేట అసెంబ్లీ కి జరిగిన ఎన్నికలలో భాగంగా రేపు ఉదయం నుండి ఎన్నికల లెక్కింపు కార్యక్రమం జరుగుతున్నది కావున ఎటువంటి విజయోత్సవ ర్యాలీ, డీజేలు పెట్టి బైక్ ర్యాలీలు చేయడం, బాణాసంచాలు కాల్చడం, ప్రజలు ఒకే చోట గుమ్ముగూడటం చట్టరీత్యా నేరం అని ఎస్సై రవికుమార్ పేర్కొన్నారు. ఈనెల 5వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉందిమరియు 144 సెక్షన్ అమల్లో ఉందని ప్రజలకు తెలియజేస్తున్నాము. కావున ప్రజలు పోలీస్ శాఖ వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు.ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకొనబడునని ఎస్సై పేర్కొన్నారు.