నిమోనియాపై సర్వే….
నిమోనియాపై సర్వే
మధిర, శోధన న్యూస్ : మండలంలోని పలు గ్రామాల్లో నిమోనియా పై వైద్య సిబ్బంది సోమవారం సర్వే నిర్వహించారు. సర్వేని మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వీరబాబు ఆధ్వర్యంలో చేపట్టారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలలో నమోదైన నిమోనియా కేసుల వివరాలను వైద్య సిబ్బంది నమోదు చేశారు. మాటూరు, మర్లపాడు, ఆత్కూర్, సిరిపురం ఆరోగ్య ఉపకేంద్ర పరిధిలోని అన్ని గ్రామాలలో జరిగిన సర్వేలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఐదు సంవత్సరాల్లోపు పిల్లలు ఉన్న కుటుంబాలకు చెందిన గృహలను పరిశీలించి వారి ఆరోగ్య పరిస్థితులు ఆరా తీశారు. జలుబు, దగ్గు, జ్వరం మరియు శ్వాస వేగంగా తీసుకోవటం. పక్కలు ఎగరవేయటం, ఆహారం,నీరు తాగలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేదా..? ఇంటి శుభ్రత పరిసరాలు పరిశుభ్రత పాటిస్తున్నారా? తదితర అంశాలపై సర్వే చేపట్టారు. ఈ లక్షణాలు కలిగిన పిల్లలకు, అనారోగ్యానికి గురైన పిల్లలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అధికారి సుభాషిని, హెల్త్ సూపర్వైజర్ భాస్కరరావు,మరియరాణి, ప్రదీప్,మహిళా ఆరోగ్య కార్యకర్తలు మరియమ్మ, సిహెచ్పి రాజ్యలక్ష్మి, సత్యవాణి, శోభ, సరస్వతి, సుజాత, ఝాన్సీ, ఆశా కార్యకర్తలు సృజన కుమారి, భారతి, మరియమ్మ,సుజాత,నాగమణి,దివ్య, అరుణకుమారి పాల్గొన్నారు.