తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

నియమ నిబంధనలను పాటించాలి

నియమ నిబంధనలను పాటించాలి
మణుగూరు సిఐ రమాకాంత్

మణుగూరు, శోధన న్యూస్: ప్రతీ ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని మణుగూరు సిఐ ఏ రమాకాంత్ సూచించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పట్టణంలోని హనుమాన్ టెంపుల్ వద్ద మణుగూరు సిఐ రమాకాంత్, ఎస్సై శ్రీనివాస్ లు సిబ్బంది తో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. మణుగూరు-భద్రాద్రి కొత్తగూడెం ప్రధాన రహదారి గుండా రాకపోకలు సాగిస్తున్న వాహనాలను నిలిపి సంబంధిత వాహన పత్రాలను, డ్రైవింగ్ లైసెన్సులను పరిశీలించి..వాహనాలను వాహనాలను నడిపే వారికి ఈ జరిమానా విధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క వాహనదారులు కోడ్ ఆఫ్ యాక్ట్, ట్రాఫిక్ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ధృవపత్రాలు లేకుండా, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *