నియోజకవర్గ అభివృద్ధిని చూసే బిఆర్ఎస్ లో చేరికలు-ప్రభుత్వ విప్ రేగా
నియోజకవర్గ అభివృద్ధిని చూసే బిఆర్ఎస్ లో చేరికలు
-పేదల జీవితాల్లో వెలుగు నింపేలా బిఆర్ఎస్ మ్యానిఫెస్టో: ప్రభుత్వ విప్ రేగా
మణుగూరు, శోధన న్యూస్: మండలం లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆకర్షితులై బుగ్గ గ్రామపంచాయతీకి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 15 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి చేసిన పనులను ప్రజలకు తేలపాలన్నారు. పేదల జీవితాలలో వెలుగులు నింపేలా మ్యానిఫెస్టో ఉందని ఆయన అన్నారు. పినపాక నియోజకవర్గం లోని అభివృద్ధి మండలాల్లోని జరిగిన అభివృద్ధి చూసి ఇతర పార్టీలో చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామకృష్ణ, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.