తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

నిష్పక్షపాతంగా ఎన్నికలకు సిద్ధం కావాలి. | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక.

నిష్పక్షపాతంగా ఎన్నికలకు సిద్ధం కావాలి.భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక.

 శోధన న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం: నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల అన్నారు. మంగళవారం బడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో పోలీస్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్సు టీము, వీడియో సర్వేలెన్సు టీము, వీడియో వ్యూయింగ్ టీము, నోడల్ అధికారులు, తహసిల్దార్లు, యంపిడిఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ఎన్నికల్లో విధులు కేటాయించిన సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. జిల్లాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలన్నారు. ఎన్నికల విధులు పట్ల సిబ్బంది సమగ్ర, స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున పటిష్ట పర్యవేక్షణ జరగాలన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి 1950, సి విజిల్ యాప్కు వచ్చిన పిర్యాదుల దరఖాస్తులు తక్షణ విచారణ నిర్వహించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో సిబ్బందికి ఎన్నికల విధులు నిర్వహణ పట్ల సమగ్ర అవగాహనకు నిరంతర సమావేశాలు నిర్వహించాలన్నారు. కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టు ప్రణాళిక తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వారిగా రూటు మ్యాపులు తయారు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్ అధికారులు విధులు చాలా ప్రధానమైనవని, అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను మ్యాపింగ్ చేయాలన్నారు. జిల్లాలోని 1095 పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపులు, వీల్చైర్లు వంటి మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. మండలస్థాయిలో యంపిడిఓలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పర్యవేక్షణ చేయాలన్నారు. తాను పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తానని ఏర్పాట్లులో లోటుపాట్లు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహణ పట్ల నిబద్దత, అంకితభావం ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరిగినా ఎన్నికల సంఘ నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. విధులు కేటాయించిన సిబ్బందికి ఎలాంటి మినహాయింపులు లేవని, ప్రతి ఒక్కరూ ఎన్నికల విధుల్లో భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెకో పోస్టుల్లో పటిష్ట పర్యవేక్షణ ఉండాలన్నారు.ఎన్నికలు నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. పటిష్ట పర్యవేక్షణ ఉంటుందని, ఏదేని సమస్య వస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. లైసెన్సు కలిగిన పిస్టల్స్న పోలీస్ శాఖకు సరెండర్ చేయాలని, సరెండర్ చేయని పక్షంలో లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లుకు అనుమతి లేదన్నారు. నగదుతో రవాణా చేయు వ్యక్తులు తగిన ఆధారాలను వెంట ఉంచుకోవాలని, సీజ్ చేయబడిన నగదు విడుదలకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటి ఉంటుందని, పరిశీలన తదుపరి విడుదల చేస్తామని ఆయన తెలిపారు. 10 లక్షలు దాటితే ఆదాయపు పన్ను అనుమతి తీసుకోవాలన్నారు. ప్రింటు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో వచ్చే వార్తలపై పర్యవేక్షణ ఉంటుందని తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సభలు, సమావేశాలు, మైకు, ర్యాలీల కొరకు సువిధ యాప్ ద్వారా అనుమతులు కొరకు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీకైన్, అటవీశాఖ అధికారి కిష్టాగౌడ్, అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రాజు, డిఆర్ రవీంద్రనాధ్, భద్రాచలం ఎఎస్పీ పరితోష్ పంకజ్, అన్ని డివిజన్ల డిఎస్పీలు, అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా అధికారులు, యంపిడిఓలు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *