తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

నీలకంఠేశ్వరునికి జిల్లా జడ్జి సతీమణి ప్రత్యేక పూజలు..

నీలకంఠేశ్వరునికి జిల్లా జడ్జి సతీమణి ప్రత్యేక పూజలు..

మణుగూరు, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని శివలింగాపురం ప్రాంతంలో వేంచేసి యున్న స్వయంభు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం లో పరమశివుడిని జిల్లా జడ్జి వసంతరావు పాటిల్ సతీమణి జ్యోతి, మణుగూరు మెజిస్ట్రేట్ వెంకటేశ్వర్లు- రమణ దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ముక్కోటి ఏకదశి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మణుగూరుకు చేరుకున్నారు. ఆలయ ప్రతిష్టను తెలుసుకున్న ఆమె ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆలయ ప్రత్యేకతను ఆలయ అర్చకులను అడిగి తెలుసుకున్నారు. సుమారు వేయి సంవత్సరాల క్రితం కాకాతీయుల కాలంలో స్వయంభూగా వెలసిన నీలకంఠేశ్వరుని గురించి తెలుసుకున్న కాకాతీయ రాజులు నాడు ఆలయ నిర్మాణం చేపట్టి పూజలు నిర్వహించారని, స్వయంభూ విగ్రంహంపైన ప్రతిష్ఠించిన విగ్రహం ఉందని అర్చకులు తెలిపారు. స్వయంభూ విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఇలా శివలింగంపై మరో శివలిం గం ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకతని అర్చకులు పేర్కొన్నారు. దర్శించుకున్న వారిలో మెజిస్ట్రేట్ కుటుంభ సభ్యులు, కోర్టు కానిస్టేబుల్ మురారి, కోర్టు సిబ్బంది వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *