నేటి బాలికలే రేపటి మహిళా లోకానికి ఆదర్శంఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి
నేటి బాలికలే రేపటి మహిళా లోకానికి ఆదర్శం
-సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి
సత్తుపల్లి, శోధన న్యూస్ : సత్తుపల్లి పట్టణం మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన గల జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సందర్శించారు.ఎమ్మెల్యే రాగమయి స్కూల్ అంతా తిరిగి తరగతి గదులను పరిశీలించారు,మధ్యాహన భోజనంపై విద్యార్థులను ఆరా తీశారు,టాయిలెట్స్, తాగునీరు వసతులు, పాఠశాల విద్యార్థులు హాజరు పట్టిక,హాజరు శాతాన్ని ప్రధానోపాధ్యాయుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం విద్యార్థులతో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చిన్ననాటి చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ,వైద్య రంగంలో వేలాదిమందికి సేవలు అందించడం జరిగింది అలాగే ఇప్పుడు,రాజకీయ రంగంలో ఎమ్మెల్యే అయిన నేను లక్షలాదిమందికి సహాయం చేసే విధంగా, అండగా నిలిచే అవకాశం వచ్చింది. అలాగే ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదివి మంచి మంచి అవకాశాలు దక్కించుకోవాలని తెలిపారు.ప్రతి ఒక్క విద్యార్థిని మంచిగా చదువుకొని,చదువుకున్న పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి రాగమయి తెలిపారు.