నేత్రపర్వంగా గుంటు మల్లేశ్వర స్వామి గ్రామోత్సవం.
నేత్రపర్వంగా గుంటు మల్లేశ్వర స్వామి గ్రామోత్సవం
ఖమ్మం, శోధన న్యూస్ :
స్థానిక గుంటు మల్లేశ్వర స్వామి గ్రామోత్సవం శుక్రవారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. స్థానిక ఆలయం నుంచి ప్రారంభమైన స్వామివారి ఊరేగింపు వాహనం నగర పుర వీధుల గుండా మేళ తాళాలతో కోలాటం నృత్యాలతో శోభాయ మానంగా నిర్వహించారు. ఈ గ్రామోత్సవ వాహనాన్ని సిఐ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చుండూరు రామకోటేశ్వరరావు, ఆలయ అర్చకులు వీరభద్ర శర్మ, కృష్ణ శర్మ, తోటకూర వెంకటేశ్వర్లు, భక్తమండలి బాద్యులు మాడిశెట్టి మదనమోహన్, మాజీ కార్పొరేటర్ బాలగంగాధర్ తిలక్ , గెల్లా కృష్ణవేణి, ఆలయ సిబ్బంది , భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆలయం నుంచి ప్రారంభమైన ఈ స్వామి వారి ఊరేగింపు ఆర్ జె సి కాలేజ్ రోడ్ , గాంధీ చౌక్, గుట్టల బజార్, పొట్టి శ్రీరాములు రోడ్ మీదుగా తిరిగి ఆలయం వరకు సాగింది. స్వామి వారి వాహనం తమ ఇండ్ల వద్దకు రాగానే భక్తులు కర్పూర హారతి నిరాజనాలు సమర్పించారు.