నేరళ్ల విశ్వనాథం సేవలు ఆదర్శనీయం : ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
నేరళ్ల విశ్వనాథం సేవలు ఆదర్శనీయం : ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
తల్లాడ , శోధన న్యూస్ : స్వాతంత్ర సమరయోధుడు, తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ నేరళ్ల విశ్వనాథం సేవలు ఎంతో ఆదర్శనీయమని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శనివారం నేరెళ్ల విశ్వనాథం కు నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు వెంకటేశ్వరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు , ఆర్యవైశ్యులు పాల్గొని నివాళులర్పించారు. అనంతరం అశ్రునయనాల మధ్య ఆర్యవైశ్యులు పార్టీలకతీతంగా ప్రజలు అంతిమయాత్రలో పాల్గొన్నారు.