ఖమ్మంతెలంగాణ

నేలకొండపల్లిలో   జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్  పర్యటన

నేలకొండపల్లిలో    జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్  పర్యటన.

నేలకొండపల్లి, శోధన న్యూస్ : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఖమ్మం జిల్లా కలెక్టర్ పివి గౌతమ్ ఈరోజు పర్యటించారు। గువ్వలగూడెం గ్రామం లో జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ పర్యటించి నిర్మాణం లో ఉన్న హెల్త్ సెంటర్ స్కూల్ భవనం , మరియు నిలిచి పోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించి ఆగి పోయిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకొని, అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలనీ అధికారులను అదేచించి నారు. నేలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు, అలాగే ఆసుపత్రుల్లో కొత్తగా నిర్మాణం చేసినటువంటి పోస్టుమార్టం గదిని సందర్శించి మార్చురీకి కావాల్సిన సామాన్లు వెంటనే వ్రాసివ్వాలని డాక్టర్ రాజేష్ ని ఆదేశించారు, అనంతరం ఆసుపత్రిలోని ప్రజలు డాక్టర్లు ఉదయం తొమ్మిదింటికి రావట్లేదని 11 గంటలకు వస్తున్నారని కలెక్టర్ గారి దృష్టికి తీసుకోనీ పొగా కలెక్టర్ గారు డాక్టర్లని సకాలంలో ఉండే విధంగా, టయానికి రావలసిందిగా ఆదేశించారు, అలాగే అదనంగా మరొక ఇద్దరు డాక్టర్లు కావాలని ప్రజలు అడగ్గా, వెంటనే పంపిస్తానని కలెక్టర్ గౌతమ్ గారు అన్నారు, రాత్రిపూట ఒక డాక్టర్ని ఆస్పత్రి యందు ఉంచాలని ,కాంగ్రెస్ నాయకుడు జెర్రిపోతుల సత్యనారాయణ అడగగా కలెక్టర్ గారు తప్పకుండా రాత్రివేళ డాక్టర్ నీ ఉంచేవిధంగా ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు, త్వరలో పూర్తి వైద్యుల్ని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు, అలాగే గవర్నమెంట్ హై స్కూల్ యందు జరుగుతున్న పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు, అనంతరం కాంట్రాక్టర్ చేసిన పనులకు బిల్లులు రావట్లేదని అడగ్గా, త్వరలోనే బిల్లులు పంపిస్తామని ఆయన అన్నారు. అలాగే ప్రజలు కరోనా పట్ల అప్ర మతంగా ఉండాలని  కలెక్టర్  గౌతమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ డాక్టర్ మాలతి, డాక్టర్ రాజేష్, ఎంపీడీవో జమలారెడ్డి, తాసిల్దార్, నేలకొండపల్లి సర్పంచ్ నవీన్ ,మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న, జారిపోతుల సత్యనారాయణ, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *