నేషనల్ అవార్డు అందుకున్న వృద్ధాశ్రమ నిర్వాహకురాలు
నేషనల్ అవార్డు అందుకున్న వృద్ధాశ్రమ నిర్వాహకురాలు
అశ్వాపురం, శోధన న్యూస్: ఆరిఫా రోషిని వృద్ధాశ్రమ నిర్వాహకురాలు షెహనాజ్ బేగం న్యూఢిల్లీలో జరిగిన ఆలిండియా బహుజన రైటర్స్ నాల్గవ నేషనల్ కాన్ఫరెన్స్లో బహుజన సాహితీ అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యు సుబ్రహ్మణ్యం మరియు సోషల్ వెల్ఫేర్ కేంద్ర మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ జి చేతుల మీదుగా అవార్డు అందజేసినారు అవార్డ్ అందజేసిన వారిలో ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షులు మన వీర్ సింగ్ పర్చా నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం విజయ లలిత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం ఎం గౌతమ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు ఇండియాలోని 27 రాష్ట్రాల నుండి సుమారు 1000 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కి హాజరైనారు. ఈ సందర్భంగా నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ ఎస్ టి బి సి మరియు మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య ఆకడమి వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమ కారులకు సంఘ సేవకులకు కవులకు రచయితలకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఎందుకు కాను ఈ సంవత్సరం స్వచ్ఛంద సంస్థ నుండి ఎస్కె షెహనాజ్ బేగం సావిత్రిబా ఫూలే అవార్డుకు ఎన్నికైనట్లు తెలిపారు. కన్న తల్లిదండ్రులను రోడ్డుమీద నిర్ధాక్షణంగా వదిలిపెడుతున్న బిడ్డలు ఉండగా వారిని చేరదీసి అమ్మలకు అమ్మగా కులమతాలకు అతీతంగా సేవ చేస్తున్న షహనాజ్ బేగం ను ఆనాటి సావిత్రిబాయి పూలే చేసిన సమాజ సేవ కన్నా తక్కువ ఏం కాదని కొన్ని ఆడారు అందుకనే ఈ అవార్డును షహనాజ్ బేగం కు ప్రధానం చేస్తున్నట్లు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో షహనా శ్వేకం మరియు మెహరాజ్ తదితరులు పాల్గొన్నారు.