నైపుణ్యతతో బీటిపిఎస్ పేరు ప్రఖ్యాతలు తేవాలి -బీటిపిఎస్ సిఇ బిచ్చన్న
నైపుణ్యతతో బీటిపిఎస్ పేరు ప్రఖ్యాతలు తేవాలి
-బీటిపిఎస్ సిఇ బిచ్చన్న
మణుగూరు, శోధన న్యూస్: క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ఉద్యోగ క్రీడాకారులు నైపుణ్యతను చాటుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్(బీటిపిఎస్)కు పేరు ప్రఖ్యాతలు తేవాలని సంస్థ సిఇ బి బిచ్చన్న తెలిపారు. శ్రీశైలం ఎడమగట్టులో టిఎస్ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్ ఉమెన్స్ గేమ్స్, కల్చరల్ ఈవెంట్లలో బీటిపిఎస్ నుండి పాల్గొన్న ఉద్యోగ క్రీడాకారులు జానపద, విచిత్రవేషధారణల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రధమ స్థానాల్లో నిలవడమే కాకుండా ఉత్తమ క్యారెక్టర్, కన్సోలేషన్ బహుమతులను కైవసం చేసుకున్నారు. శుక్రవారం ఉద్యోగ క్రీడాకారులు బీటిపిఎస్ సీఇ బిచ్చన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఈ క్రీడాకారులను అభినందించి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… టిఎస్ జెన్కో నాణ్యమైన విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ.. దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. సంస్థ క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందన్నారు. అన్ని హంగులతో క్రీడా, కళా ప్రాంగణాలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ… సంస్థ అభివృద్ధికి పాటుపడడంతో పాటు క్రీడా, కళారంగాల్లో రాణిస్తూ బీటిపిఎస్ క్కు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి అగ్రభాగాన నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కార్యదర్శి కల్తీ నరసింహరావు. డిఇ భీమ్యా, సత్యనారాయణమూర్తి, క్రీడాకారులు ఎస్ హుస్సేన్, వి శ్రీనివాసరావు, ఎస్ అంజూ, కె ధనలక్ష్మీ, ఎస్ రమాదేవి, కె సీతారత్నం, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.