పంచాయితీ పాలక వర్గాలకు ఆత్మీయ వీడ్కోలు
పంచాయితీ పాలక వర్గాలకు ఆత్మీయ వీడ్కోలు
మణుగూరు, శోధన న్యూస్ : ఐదు సంవత్సరాలు పాటు మణుగూరు మండలంలోని సమితి సింగారం, గుట్టమల్లారం, సాంబాయిగూడెం, ఇతర పంచాయితలను పరిపాలించిన పాలకవర్గాలయను ప్రజలు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. సమితీసింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ బచ్చల భారతి ఉప సర్పంచ్ పుచ్చకాయలశంకర్, గుట్టమల్లారం సర్పంచ్ కారం ముత్తయ్య, ఉప సర్పంచ్ కణితి జ్యోతి ,సాంబాయిగూడెం సర్పంచ్ కాయం తిరుపతమ్మ, ఉప సర్పంచ్ పేంటుమియా , వార్డు సభ్యులను ;పూలమాలలతో, శాలువాలతో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాదారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో చంద్రమౌళి ఎంపీ ఓ పల్నాటి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ పో శం నరసింహారావు, వార్డు సభ్యులు , పంచాయితీ కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు.