పక్షవాత బాధితురాలికి లయన్స్ క్లబ్ వితరణ
పక్షవాత బాధితురాలికి లయన్స్ క్లబ్ వితరణ
మణుగూరు, శోధన న్యూస్ : మండలంలోని కూనవరం గ్రామానికి చెందిన సన్యశ్రీ గత కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కనీసం కదల్లేని పరిస్థితిలో ఆ నిరుపేదరాలు పడుతున్న బాధలు వర్ణణాతీతం. ఈ విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, మల్టిపుల్ చైర్మన్ బాబురావు, జిల్లా 320ఈ గవర్నర్ తీగల మోహన్ రావు సూచనల మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు వారు సోమవారం బాధితురాలి పరామర్శించారు. అనంతరం రూ.1800విలువ చేసే నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను క్లబ్ అధ్యక్షులు గాజుల పూర్ణ చందర్ రావు బాధితురాలికి వితరణగా అందజేశారు. ఆపన్నులకు సహాయం అందించేందుకు లయన్స్ క్లబ్ ఎల్లవేళలా ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గాజుల పూర్ణ చందర్ రావు, కార్యదర్శి మీరా హుస్సేన్, కోశాధికారి అడబాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.