ఖమ్మంతెలంగాణ

పట్టపగలు తనికెళ్ల సెంటర్లోని షాపులో చోరీ

పట్టపగలు తనికెళ్ల సెంటర్లోని షాపులో చోరీ

-పదివేల250 అపహరణ

కొణిజర్ల, శోధన న్యూస్ : ఖమ్మం జిల్లా కొణిజర్ల  మండలంలోని తనికెళ్ళ గ్రామంలో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఇంటర్నెట్ సెంటర్లో శుక్రవారం చోరీ జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంతనికెళ్లలోని ప్రధాన సెంటర్లో ఉన్నటువంటి చంద్రిక ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్న మేకల శ్రీనివాసరావుకు చెందిన షాపులో మిట్ట మధ్యాహ్నం పట్టపగలుఒకటి 53 నిమిషాల సమయంలో గుర్తు తెలియని యువకుడు షాపులోకి ప్రవేశించి షాపులోని కౌంటర్ లో ఉన్నటువంటి 100250 నగదు అపహరణ చేస్తున్న సంఘటన సీసీ కెమెరాలు నమోదయింది.ఈ సంఘటనకు పాల్పడింది మండలంలోని ఓ ప్రముఖ విద్యా సంస్థకు చెందిన విద్యార్థిగా సీసీ కెమెరాలు నమోదైన దృశ్యాలను బట్టి పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన విషయాలు సీసీ కెమెరా దృశ్యాలను స్థానిక పోలీసులు పరిశీలించేందుకు సమాచారం ఇచ్చినట్లు సాపు యజమాని తెలిపారు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఎటువంటి చోరీ తనికెళ్లలో జరగటంతో గ్రామస్తులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *