పలు అంశాలపై ఉపాధ్యాయులకు ప్రత్యేక సమావేశం
పలు అంశాలపై ఉపాధ్యాయులకు ప్రత్యేక సమావేశం
దమ్మపేట, శోధన న్యూస్ :మండలంలో ఉన్నత పాఠశాలల సబ్జెక్ట్ టీ సి సమావేశం సోమవారం పట్వారిగుడెం,నాచారం, మల్కారం,ఉన్నత పాఠశాల లో నాలుగు మండలాల ఉన్నత పాఠశాల సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు ఉన్నతి,లక్ష్య,ల పై సమావేశం నిర్వహించడమైనది. దీనిలో బాగంగా జిల్లా మానటరింగ్ సెక్టోరియల్ అధికారి నాగరాజ శేఖర్ సందర్శించడం జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయులకు ఉన్నతి, లక్ష్య కార్యక్రమం అమలుతీరు ను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పలు సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటుగా మండలంలో సరోజనాపురం ప్రాధమిక పాఠశాల లను సందర్శించి పాఠశాల లో అమలౌతున్న ఎఫ్ ఎల్ ఎన్ పై విద్యార్థుల ను అడిగితెలుసుకున్నారు. విద్యార్థుల ప్రతిభను పరిశీలించిన ఉపాధ్యాయులు, అధికారులు విద్యార్థులు ప్రతిభ బాగుంది అన్ని సంతృప్తి వ్యక్తం చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమం లో మండల విద్యాశాఖ అధికారి కె లక్ష్మి , నోడల్ అధికారి జగపతి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ,సబ్జెక్ట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.