పాఠశాలలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాగమయి
పాఠశాలలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాగమయి
సత్తుపల్లి, శోధన న్యూస్ : సత్తుపల్లి పట్టణం పాత సెంటర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాలను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించారు,మధ్యాహన భోజనంపై విద్యార్థులను ఆరా తీశారు,టాయిలెట్స్, తాగునీరు వసతులు, పాఠశాల విద్యార్థులు హాజరు పట్టిక,హాజరు శాతాన్ని ప్రధానోపాధ్యాయుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకొని,చదువుకున్న పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అని తెలిపారు.