పాలడుగు భాస్కర్ ను మెజార్టీతో గెలిపించాలి
పాలడుగు భాస్కర్ ను మెజార్టీతో గెలిపించాలి
ఎర్రుపాలెం, శోధన న్యూస్ : ఈనెల 30 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సిపిఎం పార్టీ మధిర నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి పాలడుగు భాస్కర్ ను గెలిపించాలని శనివారం మండల పరిధిలోని గుంటుపల్లి గోపవరం భీమవరం అయ్యవారిగూడెం, రాజుల దేవరపాడు, మామునూరు ,బనిగండ్లపాడు, గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ బోడెపూడి వెంకటేశ్వరరావు కట్టా వెంకట నరసయ్య రామిశెట్టి పుల్లయ్య వారసుడిగా మీ ముందుకు వచ్చానని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని, ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజల ను ఓట్లు అభ్యర్థించారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేయాలని అన్నారు. కార్యక్రమంలో పోతినేని సుదర్శన్ రావు, సి ఐ టి యు నాయకులు వంగూరి రాములు , కార్యదర్శి వీరయ్య, వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.