పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా త్వరలో సాగునీరు… -మంత్రి శ్రీనివాస్ గౌడ్
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా త్వరలో సాగునీరు…
-మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, శోధన న్యూస్ : సాధ్యమైనంత త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందిస్తామని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం జమిస్తాపూర్ లో ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. తెలంగాణలో అమల్లో ఉన్న రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ఒక్క పథకమైన కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో అమలు అవుతున్నాయా అని ప్రశ్నించారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అమలులో ఉన్న అన్ని సంక్షేమ పథకాలు ఆగిపోతాయని మంత్రి పేర్కొన్నారు. ఒకప్పుడు ట్యాంకర్లు ఉంటే తప్ప తాగునీరు దొరికేది కాదని… ఇప్పుడు ఎగ్జామ్ ఈ జలాలను ఇంటింటికి అందిస్తున్నామన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు.మాజీ మంత్రి పి చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, జడ్పిటిసి వెంకటేశ్వరమ్మ, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, జెపిఎన్సీఈ కళాశాలల చైర్మన్ కేస్ రవికుమార్, సర్పంచ్ రామచంద్రయ్య, ఎంపీటీసీ నాగరాజు, ఉపసర్పంచ్ మొగులయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.