పినపాక అసెంబ్లీ భరిలో సిపిఐ అభ్యర్థి
పినపాక అసెంబ్లీ భరిలో సిపిఐ అభ్యర్థి
మణుగూరు, శోధన న్యూస్ : పినపాక అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తుందని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య తెలిపారు.శుక్రవారం సిపిఐ కార్యాలయంలో సరెడ్డి పుల్లారెడ్డి అధ్యక్షత పినపాక నియోజకవర్గ సమావేశం జరిగింది. సిపిఐ అభ్యర్ధిని ఎన్నికల భరిలో నిలిపేందుకు పినపాక నియోజకవర్గ కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య మాట్లాడుతూ… ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుండి సిపిఐ పార్టీ పోటీ చేస్తుందని తీర్మానం చేసి రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఈ సమావేశంలో మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి,జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వరరావు రేసు ఎల్లయ్య,జిల్లా సమితి సభ్యులు ఆర్ లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శి లు జంగం మోహన్ రావు, దుగ్యాల సుధాకర్, మువ్వ వెంకటేశ్వరరావు, అనంతనేని సురేష్, వాగబోయిన రమేష్,, రాజు, వంగర సతీష్, , కుటుంబరావు, అక్కి నరసింహారావు, అలవాల సీతారామరెడ్డి, పేరాల శీను, పత్తిపాటి నాగేశ్వరరావు గడ్గం మనోహరా చారి, మంగి వీరయ్య ,ఎస్వీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.