తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

పినపాక లో విద్యార్థులకు ఎన్నికల నిర్వహణపై అవగాహన

విద్యార్థులకు ఎన్నికల నిర్వహణపై అవగాహన

పినపాక, శోధన న్యూస్ : విద్యార్థులకు ఎన్నికల నిర్వహణపై అవగాహన కార్యక్రమంను పినపాక జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఎంపీడీవో చంద్రశేఖర్, తాసిల్దారు వీరభద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ (మాదిరి ఎన్నికలు) నిర్వ హించారు. ప్రిన్సిపల్ శేషుబాబు అధ్యక్షతన ఈ మాదిరి ఎన్నిక నిర్వహించగా 4గురు విద్యార్థులు ఎమ్మెల్యే గా పోటీ చేశారు. మిగిలిన విద్యార్థులు ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం అత్యధిక ఓట్లు సాధించిన విద్యార్థిని ఎమ్మెల్యేగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ మాదిరి ఎన్నికల నిర్వహించడం ద్వారా విద్యార్థులకు ఎన్నికలపై పూర్తిస్థాయిలో అవగాహన కలుగుతుందని తెలియజేశారు. అనంతరం విద్యార్థులచే ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమాన్ని స్లీప్-2023 ఆధ్వర్యంలో నిర్వహించినట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *