పురుగుల మందు సేవించిన వ్యక్తి మృతి
పురుగుల మందు సేవించిన వ్యక్తి మృతి
కారేపల్లి, శోధన న్యూస్ : మద్యానికి బానిసై పురుగుల మందు సేవించి యువకుడు మృతి చెందిన ఘటన సింగరేణి మండల పరిధిలోని దుబ్బ తండా గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.దీనికి సంబంధించి కారేపల్లి ఎస్ఐ పుప్పాల రామారావు అందించిన వివరాల ప్రకారం మండల పరిధిలోని దుబ్బతండా గ్రామానికి చెందిన మూడు శివ(30)పూర్తిగా మద్యానికి బానిసై సహనం కోల్పోయి పురుగుల మందు సేవించి చికిత్స పొందుతూ మృతిచెందాడు. గురువారం సాయంత్రం మద్యం సేవించి ఇంటికి రాగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో వెంటనే ఊరు బయటకు వెళ్లి పురుగుల మందు సేవించి ఉండగా అటుగా వెళుతున్న గ్రామస్తులు చూసి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగా మృతి చెందాడని ఎస్సై తెలిపారు.తండ్రి భీముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.