పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
పినపాక, శోధన న్యూస్ : పినపాక మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 2004 – 2005 పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం బుధవారం కరకగూడెం మండలం రాళ్లవాగు వద్ద అపూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారికి విద్యాభ్యాసం నేర్పిన ఉపాధ్యాయులు ఎర్ర ప్రగడ రామ్మూర్తి, భూపతి హనుమంతరావులను సాధరంగా ఆహ్వానించి శాలువా,పూల బొకేలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ… మందస్మిత స్మృతలను.. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని సమ్మేళనానికి వచ్చిన విద్యార్థులందరిని ఆశీర్వదించారు. తరువాత పూర్వ విద్యార్థులు వారి వారి విద్యాభ్యాసం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆనందంగా ఆడపాటలతో సంతోషంగా సమ్మేళనాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన సత్యం, శ్రీను, కిషోర్, కొరసవెంకటేశ్వర్లు,, నిర్మల, రిజ్వాన, సరస్వతి, స్వప్న, రమాదేవి,నాగార్జున, మధు, సంతోష్, పుష్ప, శారదా,రమణ, భారతి తదితరులు పాల్గొన్నారు.