తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

పెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన ఏడిఏ 

పెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన ఏడిఏ 

పినపాక,శోధన న్యూస్: పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం లో గల సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ దుకాణాలపై మణుగూరు ఏడిఏ తాతారావు,  వ్యవసాయశాఖ  ఏవో వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయానికి సంబంధించిన పెస్టిసైడ్స్ , విత్తనాల రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఏడిఏ తాతారావు మాట్లాడుతూ రైతులకు నకిలీ విత్తనాలు , పురుగు మందులుఇచ్చి మోసం చేయకూడదని అన్నారు. నకిలీ విత్తనాలు ఉన్నా పెస్టిసైడ్స్ నకిలీ మందులు ఉన్నా రైతులకు విక్రయించినా పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *