పేదలకు భరోసాగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు
పేదలకు భరోసాగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు
- యువనేత మల్లు సూర్య విక్రమాదిత్య
మధిర, శోధన న్యూస్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలతో పేదలకు భరోసా నిలవనున్నాయని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క తనయుడు యువనేత మల్లు సూర్య విక్రమాదిత్య అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కను గెలిపించాలని కోరుతూమండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు సూర్య విక్రమాదిత్య మాట్లాడుతూ ఈ నెల 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. మహాలక్ష్మి క్రింద మహిళలకు ప్రతి నెలా రూ. 2500, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఏటా ఎకరాకు రూ.15వేల పెట్టుబడి సాయం, వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే కూలీలకు ప్రతి ఏటా రూ.12 వేలు వంటి పధకాలు అమలు చేయనుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. మధిర అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క అఖండ విజయంతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ తూమాటి నవీన్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ధారా బాలరాజు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అద్దంకి రవి కాంగ్రెస్ నాయకులు దుంపా వెంకటేశ్వర రెడ్డి నిడమానూరు వంశీ, కర్నాటి రామారావు తదితులున్నారు.