ఖమ్మంతెలంగాణ

పేదల అభ్యున్నతి  కాంగ్రెస్ తోనే సాధ్యం   – మల్లు నందిని

పేదల అభ్యున్నతి  కాంగ్రెస్ తోనే సాధ్యం 

-అమ్మ ఫౌండేషన్ చైర్మన్  మల్లు నందిని

మధిర, శోధన న్యూస్ :   పేదల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని  అమ్మ ఫౌండేషన్ చైర్మన్ సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని అన్నారు. శనివారం మండల పరిధిలోని అల్లినగరం గ్రామానికి చెందిన సిపిఎం నాయకులు స్థానిక భట్టి క్యాంపు కార్యాలయంలో మల్లు నందిని సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మల్లు భట్టి విక్రమార్క మూడుసార్లు మధిర ఎమ్మెల్యేగా పనిచేసి మధిరను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయటం జరిగింది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. నవంబర్ 30న జరిగే మధిర అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి మల్లు భట్టి విక్రమార్కుని గెలిపించాలని ఆమె కోరారు. మధిర ప్రజల వేసిన ఓటుతో మల్లు భట్టి విక్రమార్క మధిర కీర్తిని దేశవ్యాప్తంగా విస్తరింప చేశారన్నారు. 15 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని అందులో కీలక స్థానంలో ఉంటారని ఆమె తెలిపారు. పార్టీలో చేరిన అల్లినగరం సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి సంపాసల గోపాలరావుకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అల్లినగరం గ్రామ శాఖ అధ్యక్షులు సూర్యదేవర కోటేశ్వరరావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావు, క్లస్టర్ ఇంచార్జ్ చంపశాల రామకృష్ణ, బిట్రా ఉద్దండయ్య, దారా బాలరాజు నిడమానూరు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *