పేద విద్యార్దినులకు మణుగూరు లయన్స్ క్లబ్ చేయుత
పేద విద్యార్దినులకు లయన్స్ క్లబ్ చేయుత
-పరిక్ష ఫీజుకు నగదు అందజేత
మణుగూరు, శోధన న్యూస్: పట్టణంలోని మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వి ద్యనభ్యసిస్తున్న పలువురు పేద విద్యార్థినులకు పేద మణుగూరు లయన్స్ క్లబ్ చేయుత అందించింది. లయన్స్ క్లబ్ సభ్యులు చింతపల్లి రాంబాబు సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు ఆధ్వర్యంలో రూ.10వేలను పరీక్ష ఫీజు చెల్లించేందుకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ కు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు గాజుల పూర్ణ చందర్ రావు మాట్లాడుతూ… ఆర్థిక స్థోమత లేక పరీక్ష ఫీజు చెల్లించేందుకు విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రిన్సిపల్ తమ దృష్టికి తీసుకువచ్చారని, వెంటనే ఆ విద్యార్థినులకు ఆర్థిక సహాయంగా ఫీజును చెల్లించామన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో చదువు తున్న నిరుపేద విద్యార్థుల కు లయన్స్ క్లబ్ అండగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి మీరా హుస్సేన్, పీఆర్సి గాజుల రమే షకుమార్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది. విద్యార్ధులు పాల్గొన్నారు.