తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

పొగాకు రైతులను ఆదుకోవాలని  కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కు వినతి

పొగాకు రైతులను ఆదుకోవాలని  కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కు వినతి
అశ్వారావుపేట , శోధన న్యూస్: మిచౌంగ్ తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కేంద్ర మంత్రివర్యులు నిర్మల సీతారామన్ కు పొగాకు రైతు సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో పంటలకు అన్ని విధాలుగా నష్టం చేకూరిందని పొగాకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని ప్రతి బ్యారన్ కు లక్ష రూపాయల తక్షణమే తక్కువ వడ్డీ రేటు తో రుణాన్ని ఇప్పించాలని అలాగే గతంలో తుఫాను సంభవించినప్పుడు టొబాకో బోర్డు నుండి ప్రతి బేరన్కు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేశారని అదేవిధంగా మరల ఇప్పుడు అదే ఆర్థిక సహాయం అందేలా చూడాలని రైతులు సమస్యలను మంత్రికి విన్నవించారు. ఈ విషయమై నిర్మల సీతారామన్ మాట్లాడుతూ తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించి రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి, మాగంటి బాబు, టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్, కరాటం రెడ్డి బాబు, సత్రం వెంకటరావు, పరిమి రాంబాబు, వేముల సూర్య ప్రకాష్ రావు, తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *