పోడు పట్టాల పంపిణీ చారిత్రాత్మకం-అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా
పోడు పట్టాల పంపిణీ చారిత్రాత్మకం
-అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
దమ్మపేట , శోధన న్యూస్ : పోడు పట్టాల పంపిణీ ఒక చారిత్రాత్మిక ఘట్టంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు . దమ్మపేటలో సోమవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో అయన మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అశ్వారావుపేట నియోజక వర్గంలో 23 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వటం జరిగిందని ఈ ఘనత తమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు . అలాగే అశ్వారావుపేట నియోజక అభివృద్ధికి తాను అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయించి 100 పడకల ఆసుపత్రి , డిగ్రీ కాలేజ్ ,డయాలసిస్ సెంటర్ , రోడ్లు , సెంట్రల్ లైటింగ్ , సిసి రోడ్లు ఇంకా పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి నియోజక అభివృద్ధికి తోడ్పాటునందించారని అన్నారు .నా చివరి శ్వాస వరకు అశ్వారావుపేట నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తా నని తెలిపారు .ఏ ఎమ్మెల్యే పర్యటించని మారుమూల గ్రామాల్లో సైతం పర్యటించి అక్కడి ప్రజా సమస్యలను తన శక్తి మేరకు పరిష్కరించానని తెలిపారు .అలాగే ముందు ముందు ప్రజలు ఆశీర్వదిస్తే మరింత సేవచేస్తా అన్నారు. రాష్ట్రంలో బిఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం తధ్యమని , ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని దమ్మపేట ప్రజా ఆశీర్వాద సభలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు . కేసీఆర్ ప్రవేశపెట్టిన పధకాలు పేద ప్రజల అభ్యున్నతికే నని , బిఆరెస్ పధకాలు ప్రతి ఇంటికి , ప్రతి గడపకు ఎదో రూపేణ అందుతున్నాయన్నారు .ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కావాలా , మాయమాటలు చెప్పి అమలుకాని వాగ్దానాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ప్రభుత్వం కావాలో తీర్పు చెప్పాల్సింది ప్రజలే అన్నారు . తనకు మరోసారి అవకాశం ఇస్తే అశ్వారావుపేట నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా నని తెలిపారు . ఈనెల 30 న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు కోసం అడిగిన వెంటనే అశ్వారావుపేట నియోజక వర్గానికి వచ్చి నా గెలుపు కోసం ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన తమ నాయకుడు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎంపీలు నామానాగేశ్వరరావు , బండి పార్ధసారధి రెడ్డి , ఎమ్మెల్సీ తాతా మధు , ఇంచార్జి ఉప్పు నూతల వెంకట రమణ , మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ,జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు రావు జోగేశ్వరరావు ,జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు , దొడ్డాకుల రాజేశ్వరరావు ,వైస్ ఎంపిపి దారా మల్లిఖార్జునరావు , పర్వతనేని రామకృష్ణ , దొడ్డా రమేష్ , వగ్గెల పూజ , సున్నం నాగమణి , భూక్యా ప్రసాద్ , అంకత మహేశ్వరరావు , దమ్మపేట ,అశ్వారావుపేట , ములకలపల్లి , చండ్రుగొండ , అన్నపురెడ్డిపల్లి మండలాలకు చెందిన బిఆరెస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.