ఖమ్మంతెలంగాణ

పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని సత్తుపల్లి ఎమ్మెల్యేకు వినతి  

పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యేకు వినతి  

సత్తుపల్లి, శోధన న్యూస్ : పోడు భూములన్నింటికి  పట్టాలు ఇప్పించాలని,పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఫారెస్ట్ అధికారులు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో డాక్టర్ మట్టా.రాగమయి దయానంద్ కి ఆదివారం వినతి పత్రం అందజేశారు. తుమ్మల నగర్ గిరిజన పోడు సాగుదారులు .సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీలో గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా గిరిజనులను ఇబ్బంది పెట్టడంతో ఆదివారం సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ని గిరిజనులు కలిసి తమ న్యాయమైన సమస్యలను తెలియచేశారు. 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేసి గిరిజన పై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో ఇట్టి భూమిని అక్రమంగా ఫారెస్ట్ అధికారులు అక్రమంగా స్వాధీన పరుచుకొని ఇబ్బంది పెట్టారని అయినా వదలకుండా మా పోడు సాగు చేసుకుంటున్నామని దీనికి ఫారెస్ట్ అధికారులు అడ్డుపడి మాపై దౌర్జన్యం చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యేకు వివరించారు ఇట్టి విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మా సమస్య పరిష్కరించాలని గిరిజనులు తమ సమస్యను వివరించారు ఇట్టి విషయాన్ని విని స్పందించిన ఎమ్మెల్యే మీ యొక్క సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని మీ సమస్య తప్పక పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ గడ్డం కృష్ణయ్య ధారబోయిన రాజు తాటి రాజులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *