Ranagareddyతెలంగాణ

పోలింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ

పోలింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ
కలెక్టర్ కలెక్టర్ భారతి హోలీకేరీ.

రంగారెడ్డి ,శోధన న్యూస్:పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కలెక్టర్ భారతి హోలీకేరీ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరీ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని దేవేందర్ నగర్ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్,తుక్కుగూడ జిల్లా పరిషత్ హై స్కూల్ , రావిర్యాల జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన 10 పోలింగ్ కేంద్రాలను,రాజేందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శంషాబాద్ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్, డిగ్రీ కాలేజీలలో ఏర్పాటు చేసిన 24 పోలింగ్ కేంద్రాలను,శివరాం పల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలను పరిశీలించి,ఏర్పాట్లపై తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన పనులు పరిశీలించి,మిగిలి ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రతి పోలింగ్‌ కేంద్రంలో త్రాగునీరు,ఎలక్ట్రిసిటీ, ఫర్నిచర్, టాయిలెట్స్‌,షామియాన మౌళిక వసతులు కల్పించాలన్నారు. వికలాంగుల కొరకు ర్యాంప్‌ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.ఈ తనిఖీలో కలెక్టర్ వెంట రాజేందర్ నగర్ ఏఈఆర్ఓ , తహశీల్దార్,ఏసీపీ,ఆర్డీఓ సూరజ్,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *