పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక.
భద్రాద్రి కొత్తగూడెం,శోధన న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసి ఏర్పాట్లపై తగు ఆదేశాలు జారీ చేశారు. 244, 245, 246 జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల సుజాతనగర్ పోలింగ్ స్టేషన్‌లను సందర్శించి, కనీస సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో రొయ్య పిల్లలను వదిలారు.సుజాతనగర్‌లోని అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్స్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షను తనిఖీ చేసారు. సుజాతనగర్‌లో ఆర్‌ఓబి పనులను పరిశీలించి, పనులు వేగవంతం చేయాలని ఆర్‌అండ్‌బి శాఖలకు సూచించారు.పోలింగ్ స్టేషన్లు 181,182, 184, 185, 186, 187- రామవరం, విద్యుత్ సరఫరా లేదని, విద్యుత్తు సౌకర్యం లేదని, అలాగే మన ఊరు – మన బడి బుక్‌లెట్ ప్రకారం చాలా లోపాలు మరియు వ్యత్యాసాలున్నామని వారంలో పనులు పూర్తి చేయాలని సంబంధిత ఏజెన్సీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులు అసంపూర్తిగా ఉంటే బిల్లులు నిలిపివేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం పట్టణంలో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను పరిశీలించారు. పనులు నత్తనడకన జరుగుతున్నాయని, కూలీలు కూడా పని ప్రదేశంలో లేకపోవడం, పనుల్లో జాప్యం పట్ల ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.