పోలింగ్ స్టేషన్లను అకస్మికంగా సందర్శించిన కలెక్టర్
పోలింగ్ స్టేషన్లను అకస్మికంగా సందర్శించిన కలెక్టర్
కొణి జర్ల, శోధన న్యూస్ : ఖమ్మం జిల్లా కొణి జర్ల మండలంలోని అమ్మపాలెం రాజ్య తండా పోలింగ్ స్టేషన్లను ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అకస్మికంగా బుధవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ వసతి, సౌకర్యాలు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న సందర్భంగా ఓటర్లకు సంబంధించిన సౌకర్యాలు ఏర్పాట్లు సంబంధించినటువంటి వివరాలను స్థానిక అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో పలు విషయాలు పరిశీలించినటువంటి కలెక్టర్ ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధించిన అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.గ్రామపంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ కేంద్రాల వద్ద పలు సూచనలు అధికారులకు చేశారు. వారి వెంట ఎంపీడీవో మహాలక్ష్మి, తహశీల్దార్, సి ఈ ఈఈ, ఏ ఈ ఎంఈఓ పాఠశాల ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, బిఎల్ఓలు ఉ న్నారు.