పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్….
అశ్వాపురం పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్
అశ్వాపురం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లో అశ్వాపురం సిఐ రవీందర్ ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముందస్తుగా మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. మండల ప్రజలకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు… 30 న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని, రాజ్యాంగం కల్పించిన ఓటు ద్వారా నాయకులను ఎన్నుకోవాలని.. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు, రాజకీయ నాయకులు సహకరించాలని పోలీసులు తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో మణుగూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులు , టి ఎస్ ఎస్ పి పోలీస్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ బెటాలియన్ సిబ్బంది , ఏడూళ్ల బయ్యారం సి.ఐ శివప్రసాద్ లు కలిసి మొండికుంట గ్రామం మీదుగా మల్లెలమడుగు రామచంద్రపురం నెల్లిపాక బంజర మీదుగా ఆనందపురం వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎస్సై సురేష్ కరకగూడెం ఎస్ఐ రాజారాం ఏడూళ్ల బయ్యారం ఎస్సై సురేష్, ఏ ఎస్ ఐ రాంకీ యాదవ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.