పోలీసుల జీవితాలు దేశ రక్షణ కు అంకితం
పోలీసుల జీవితాలు దేశ రక్షణ కు అంకితం
– సీపీ సందీప్ శాండిల్యా
హైదరాబాద్, శోధన న్యూస్: పోలీసుల జీవితాలు దేశ రక్షణకు అంకితమని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సీపీ సందీప్ శాండిల్యా అన్నారు. పోలీస్ అమరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతర పోలీసు శాఖలోని వివిధ విభాగాల వారు చేసిన త్యాగాలను తెలిపే ఆల్బమ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు అహర్నిశలు శ్రమిస్తారనీ పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం ఎంత త్యాగానికైనా వెనుకాడరని చెప్పారు. పోలీసు అమరుల స్మరణ తమలో మరింత స్ఫూర్తి రగిలిస్తుంది అని తెలిపారు. ప్రజలతో మమేకమై పని చేయడం ఆనందంగా ఉంటుందని వెల్లడించారు.