పోలీసుల వాహన తనిఖీ
పోలీసుల వాహన తనిఖీ
మణుగూరు, శోధన న్యూస్: పట్టణంలోని తెలంగాణ చౌరస్తా లో ఏఎస్సై మోహన్ వాహనాల తనిఖీ నిర్వహించారు. పట్టణ ప్రధాన రహదారి గుండా రాకపోకలు సాగిస్తున్న వాహనాలను నిలిపి క్షుణ్ణంగా తనిఖీ చేసి సంబంధిత ధృవపత్రాలను, డ్రైవింగ్ లైసెన్స్ లను పరిశీలించారు. సరైన పత్రాలు లేని, హెల్మెట్ ధరించని వాహనదారులకు ఈ ఛలానా విధించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.