తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం : జిల్లా ఎస్పీ  వినీత్

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం : జిల్లా ఎస్పీ  వినీత్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: పోలీస్ అమరవీరుల సంస్కరణ కార్యక్రమాలలో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆన్లైన్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ప్రాభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు సేవ చేయడం గర్వకారణం అని అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరికి తెలియజేయడంలో భాగంగానే పోలీస్ అమరవీరుల దినోత్సవం అక్టోబర్ 21 నుండి సైకిల్ ర్యాలీలు,రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు,ఫోటోగ్రఫీ పోటీలు,ఆన్లైన్ ఓపెన్ హౌస్ లాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ ఆన్లైన్ ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా జిల్లాలోని సుమారుగా 120 ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినీ,విద్యార్థులకు ప్రస్తుతం పోలీస్ శాఖ ఉపయోగిస్తున్న ఆయుధాలు,బాంబు స్వాడ్ సామాగ్రీ గురించి వివరించడంతో పాటు జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న పోలీస్ జాగిలాల పనితీరును కూడా వారికి ఆన్లైన్ ద్వారా వివరించడం జరిగింది.పోలీస్ అమరవీరుల త్యాగాలను భావిభారత పౌరులైన విద్యార్థులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు.పోలీస్ స్టేషన్,రిసెప్షన్,స్టేషన్ రైటర్,బ్లూ కోల్ట్స్ పనితీరు,పోలీస్ వాహనాల వినియోగం గురించి పోలీస్ స్టేషన్లోని అన్ని విభాగాల గురించి వివరించారు.జిల్లా ప్రజలను,యువతీ యువకులను,విద్యార్థులను భాగస్వాములుగా చేస్తూ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న పోలీసు అధికారులను,సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,కొత్తగూడెం త్రీ టౌన్ సిఐ మురళి,1టౌన్ సిఐ కరుణాకర్,అడ్మిన్ ఆర్ఐ రవి,ఎంటిఓ సుధాకర్,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,ఆర్ఐ నాగేశ్వరరావు,ఐటి కోర్ ఇంచార్జి సిఐ సతీష్,ట్రాఫిక్ ఎస్సై నరేష్, ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *