పోలీసు అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయం
పోలీసు అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయం
-తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ యాదవ్
హైదరాబాద్, శోధన న్యూస్: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం అన్ని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే ను గోషా మహల్ పోలీస్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అహ్వానితులుగా రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ హాజరయ్యారు. పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం అమరులువారు అనే పుస్తకాన్ని డీజీపీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ భద్రత కోసం అమరులైన 189 మంది పోలీస్ అధికారుల త్యాగాలను గుర్తుచేశారు. పోలీసులు సమాజానికి రక్షణ కవచం వంటి వారిని పేర్కొన్నారు.ఏ క్షణమైనా ప్రజలకు సమస్య వస్టే వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేసేది పోలీసులు అన్నారు.నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు అయినా పోలీసు వృత్తి ఎంతో కటినమైన సవాళ్లతో కూడుకున్నదన్నారు. అటువంటి వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ స్వార్ధాన్ని వీడి సమాజం కోసం పని చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్య, అడిషనల్ డీజీలు సౌమ్య మిశ్రా,శివధర్ రెడ్డి,సంజయ్ కుమార్ జైన్,మహేష్ భగవత్, రిటైర్డ్ డీజీపీ లు, పోలీస్ రిటైర్డ్ ఉన్నతాధికారులు, అమర పోలీసు కుటుంబాలు,హైదరాబాద్ సిటీ పోలీసు ఉన్నతాధికారులు, అడిషినల్ సిపిలు విక్రమ్ సింగ్ మాన్,సుధీర్ బాబు, వి శ్వ ప్రసాద్, జాయింట్ సిపిలు ఎం శ్రీనివాసులు, గజరావు భూపాల్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.